’31లోగా డెలివరీ పూర్తి చేయాలి’

యాసంగి పంటకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం డెలివరీ ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మిల్లర్లు అందరూ తమకు కేటాయించిన గోడౌన్లలో వెంట వెంటనే రోజువారీ బియ్యాన్ని టార్గెట్‌గా పెట్టుకొని డెలివరీ చేయాలన్నారు. బియ్యం డెలివరీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.