నాయకులు దేశానికి ఉపయోగ పడే పనులే చేయాలి. టైం పాస్ పనులు చేసి పబ్లిక్ లో అల్లరి కాకూడదు. రాజమహేంద్ర వరం ఎంపీ మార్గాని భరత్ విషయమై ఇప్పుడు జరిగిందిదే! నెట్లో ఆయన ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి..ఆ వైరల్ కథేంటంటే?
ఆ ఎంపీ ఏం చేశాడో తెలుసా ?? ఆ ఎంపీ ఎందుకిలా చేశాడో తెలుసా?? అంటూ వరుస ట్రోల్స్ వస్తున్నాయి రాజమండ్రి యువ ఎంపీ మార్గాని భరత్ పై.. ఇంతకూ ఆయనేం తప్పూ చేయలేదు.. పాపమూ చేయలేదు. జస్ట్ ఇన్ స్టాలో ఒన్ మిలియన్ ఫాలోవర్స్ ను తెచ్చుకున్న తన ప్రాంతం అమ్మాయిని పిలిచి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. అంతేకాదు ఆ సంతోషాన్ని ఇన్ స్టాలోనూ పంచుకున్నాడు.ఇంకేం అసలు విషయం కన్నా కొసరు ఎక్కువయిపోయింది అని ఎంపీ బాధపడిపోతున్నాడు.. తప్పా అండి ఇన్ స్టా లో క్రేజ్ దక్కించుకున్న అమ్మాయి ఇచ్చిన పార్టీకి వెళ్లడం తప్పా? అని కూడా అంటున్నారు ఎంపీ.
అభివృద్ధి పనుల్లో బెస్ట్ అనిపించుకునో లేదా దేశానికి ఖ్యాతి తెచ్చే పనులు చేసే ఎంపీలు మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు అవి కూడా దేశానికి పెద్దగా ఉపయోగం లేని విషయాలు లైమ్ లైట్ లోకి తెచ్చి, వాటిని సెలబ్రేట్ చేసి ఎంపీలు తమ పరువు తామే తీసుకుంటున్నారు.దేశంలో ఉన్న సమస్యలపై మాట్లాడి వాటి గురించి ఇతరులతో చర్చించి,ఓ మంచి పరిష్కారం చూపాల్సిన ఎంపీలు సోషల్ మీడియాలో అక్కర్లేని సందేశాలు ఇస్తూ, పోస్టులు చేస్తూ తామేం చెప్పాలనకుంటున్నారో అన్న విషయమై స్పష్టతే కోల్పోతున్నారు.ఎంపీ మార్గాని భరత్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇన్ స్టా లో ఫాలోవర్స్ దక్కించుకోవడం ఏమయినా పెద్ద విషయామా? పోనీ ఆమె ఏమయినా దేశానికి సేవ చేశారా? దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే పనుల్లో భాగం అయితే మీరు రాయండి ప్రశంసించండి ఎంపీ గారూ ఇలాంటివెందుకు అని కూడా అడుగుతున్నారు ఇంకొందరు.