దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో పురాతన చరిత్రాత్మక ఆనవాళ్లు లభించినట్లు చరిత్ర పరిశోధకుడు పృధ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. గ్రామ శివారులో పలు పురాతన శిల్పాలను ఆయన శనివారం పరిశీలించారు. 8 శతాబ్దాల క్రితం నాటి శిల్పాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయన్నారు. కాకతీయుల కాలం నాటి కోట గోడలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఇటీవల కాలంలో బయటపడ్డాయని తెలిపారు. ఇంకా మరికొన్ని బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.