అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో జరుగుతున్న గంగమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా ‘సంగీత విభావరి’ పేరుతో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే అనాథాశ్రం ప్లెక్సీలు ఉన్న వాహనంపై ఈ తతంగం జరిగింది. పోలీసులు గ్రామానికి చేరుకుని అశ్లీల నృత్యాలను అడ్డుకున్నారు.
