నల్గొండ : కోదాడ బస్టాండ్‌లో గంజాయి పట్టివేత

కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం తెల్లవారుజామున 100 కిలోల గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 6సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలోని అరకు ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి హైదరాబాదులో ఎక్కువగా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.