నల్గొండ: సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి

నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళికను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌తో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ లు పాల్గొన్నారు.