నల్గొండ జిల్లాలో పురాతన విగ్రహం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు గ్రామంలో పురాతన విగ్రహం బయట పడింది. అలుగుబెల్లి లింగారెడ్డి.. దుకాణం వద్ద నీటి గుంట కోసం త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో పురావస్తు విగ్రహం బయటపడింది. గ్రామస్తులు ఈ విషయమై పురావస్తు శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం అందజేశారు. దీoతో వారు విగ్రహాన్ని బయటకు తీసి పానగల్ మ్యూజియంలో భద్రపరిచారు.