నల్లగొండ జిల్లా వేములపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుమారుడు అంధుడైన కారణం చేత ఓ తల్లి కన్న కొడుకును సాగర్ ఎడమ కాలువలో పడేసింది. దీంతో ఎడమ కాలువలో బాలుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.