నల్లగొండ మున్సిపాలిటీకి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.342 కోట్ల 53 లక్షల 35 వేల అంచనా ఆదాయం, రూ.207 కోట్ల 53 లక్షల 35 వేల అంచనా వ్యయంతో రూపొందించిన బడ్జెట్ను మున్సిపాలిటీ ఆమోదించింది. శనివారం మున్సిపల్ చైర్మన్ ఎం.సైదిరెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీ సమావేశ మందిరంలో బడ్జెట్ను ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.