కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు, ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు : ఎంపీ బండి

-

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు, ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు. BRS పార్టీకి అభ్యర్థులు లేరు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రకటనకు 15 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించిన దమ్మున్న పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దేశంలో నంబర్ వన్ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పోయింది, ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదు. ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లు 26 వేల ఉద్యోగాలకు, 56 వేలు నియమించామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది.

ప్రతి ఉద్యోగికి 12 లక్షల 70 వేల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది బీజేపీ పార్టీ. BRS పార్టీ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఇప్పించిన ఘనత బీజేపీ పార్టీది. 317 జీఓ రద్దు కోసం కొట్లాడింది బీజేపీ. BRS పార్టీ హయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చిత్రహింసలు పెడితే ఏ పార్టీ మద్దతు తెలుపలేదు అని బండి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news