కరీంనగర్: డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 20లోపు పరీక్ష రుసుం చెల్లించాలని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. 3వ సెమిస్టర్ విద్యార్థులకు 17 నుంచి, 5వ సెమిస్టర్ 25 నుంచి, 1వ సెమిస్టర్ మే 7నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.