
తాను అన్న మాటలు అబద్ధం అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ టెండర్ల విషయంలో గోల్ మాల్ జరిగిందని, దీని ద్వారా రూ.20 వేల కోట్ల ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. వెంటనే టెండర్లు రద్దు చేసి రీ టెండర్లు నిర్వహించాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు.