
పహాడీషరీఫ్: నీటిని వేడి చేస్తున్న బకెట్‌లో చేయి పెట్టి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం బాలాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మహ్మాద్ సిరాజుద్దీన్ కుమారుడు సూఫియన్(4) స్నానం కోసం పెట్టిన హిటర్ బకెట్లో చేతి పెట్టడంతో కరెంట్ షాక్‌కు గురై.. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపారు.