బస్సు దిగుతూ అనంత లోకాలకు

ఆర్టీసీ బస్సు దిగే సమయంలో కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. భోగారం గ్రామానికి చెందిన కుమ్మరి బాల్ నర్సింహ(60) గురువారం పని మీద కుషాయిగూడ వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో ధర్మారం వెళ్లే బస్సు ఎక్కి కీసరలో దిగే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది పరీక్షించి అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.