రంగారెడ్డి : ‘మాస్కులు ఇలా ధరించొద్దు’

బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న 50 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మాస్క్‌లు ధరించని 50 మందిపై, ముక్కుపైకి మాస్క్‌ ధరించని వారిపై కూడా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. మాస్క్ ముక్కును కవర్ చేస్తూ ధరించాలన్నారు. అలా కాకుండా కిందకి ధరించినా.. లేదా మొత్తమే ధరించకపోయినా కేసులు నమోదు చేస్తామన్నారు.