తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం.. మరికాసేపట్లోనే నైట్ కర్ఫ్యూ పై ప్రకటన

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో… రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి… తెలంగాణ మంత్రులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ పై కేబినెట్ కు పూర్తి వివరాలను అందించారు తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు.

గత 15 రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న వివరాలను పూర్తి వివరాలతో కేబినెట్ కు తెలియజేశారు. ఇక ఈ వివరాల ను అధ్యయనం చేసిన తర్వాత కేబినెట్ నైట్ కర్ఫ్యూ పై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. నైట్ కర్ఫ్యూ లేదా మినీ లాక్ డౌన్ అలాంటి ఆలోచనలను తెలంగాణ కేబినెట్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ప్రతి ఆదివారం తెలంగాణలోను లాక్ డౌన్ పెట్టే ఆలోచనను కూడా కేసీఆర్ క్యాబినెట్ ఆలోచన చేస్తోంది. అయితే దీనిపై మరికొన్ని క్షణాల్లోనే కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. అయితే ఇది సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నని అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.