
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పరిధిలోని పాలమాకుల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బైకును లారీ ఢీకొనడంతో ముచ్చింతల్‌కు చెందిన అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.