పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా ఈ నెల 25న విడుదల అయినా భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. రికార్డుల మోత మోగిస్తుంది. ఈ సినిమా సక్సస్ పై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతి నిధులు మాత్రం.. పవన్ సినిమా పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి కే పలువురు భీమ్లా నాయక్ సినిమా పై విమర్శలు చేయగా.. తాజా గా ఎమ్మెల్యే అమరనాథ్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
భీమ్లా నాయక్ ఒక రీమేక్ సినిమా అని అన్నారు. దీనికి రేటింగ్ సున్నా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రీమేక్ సినిమాకు చంద్ర బాబు, లోకేశ్ ఎంత రేటింగ్ ఇచ్చినా.. వేస్ట్ అని ఎద్దేశ చేశారు. పవన్ సినిమాపై ఇంతలా మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేశ్.. తారక్, బాలయ్య సినిమాలకు ఎందుకు మాట్లాడలేరని ప్రశ్నించారు.
అలాగే సీబీఐ సీబీఎన్ తో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీఎం జగన్ పై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఈ హత్య కేసులో దోషులు బయట పడాలంటే.. చంద్రబాబు, బిటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి కాల్ డేటా తీయాలని అన్నారు.