ప్రెగ్నెన్సీలోనూ త‌గ్గేదే లే.. బేబి బంప్‌తో జిమ్‌లో కాజల్ వ‌ర్క్ ఔట్స్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రెగ్నెన్సీ అయిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల కాజ‌ల్ అగర్వాల్ శ్రీమంతం కూడా అంగ రంగ వైభవం గా నిర్వ‌హించారు. కాగ కాజ‌ల్ అగర్వాల పెళ్లి త‌ర్వాత బ‌య‌ట ప్ర‌పంచానికి ఎక్కువ క‌నిపించ లేదు. కానీ ఇటీవ‌ల ప్రెగ్నెన్సీ అయిన త‌ర్వాత ఆ మ‌ధుర క్షణాల‌ను సోషల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇటీవ‌లే బేబి బంప్ తో ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు తెగ వైర‌ల్ అయ్యాయి.

అలాగే తాజా గా కాజ‌ల్ బేబి బంప్ తో మ‌రోసారి అభిమానుల‌కు క‌నిపించింది. అయితే ఈ సారి మాత్రం మాములు గా కాదండీ..బేబి బంప్ తో జిమ్ లో వ‌ర్క్ ఔట్స్ చేస్తుంది. ప్ర‌త్యేకంగా ఒక ట్రైన‌ర్ తో స్వ‌ల్పంగా వ‌ర్క్ ఔట్స్ చేస్తుంది. బేబి బంప్ ఉన్నా.. త‌గ్గేదే లే.. అంటు జిమ్ లో క‌ష్ట ప‌డుతుంది. ఈ వీడియోను కాజ‌ల్ త‌న ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. కాగ ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. కాగ ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో బ‌ద్ధకంగా ఉండకుండా.. ఆరోగ్యం కోసం కాజ‌ల్ వ‌ర్క్ ఔట్స్ చేయ‌డంతో అభిమానులు త‌మ కామెంట్స్ పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news