ఎంతటిదాన్నైనా సాధించే సత్తా యువత సొంతం: ఈటల

సంక్రాంతి పండుగ సందర్భంగా మొయినాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో తమ సత్తా చాటి గెలుపొందిన విజేతలకు హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత శక్తివంతులు యువతేనని..ఎంతటి దానినైనా సాధించగల సత్తా యువత సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.