రంగారెడ్డి: ఆదర్శ ఉపాధ్యాయుల ఆవేదన

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అవర్లీ బేస్డ్ ఉపాధ్యాయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది ఆదర్శ పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి రెగ్యులర్ బోధన సిబ్బంది లేకపోవడంతో అవర్లీ బేస్డ్ టీచర్స్‌తోనే కొనసాగుతున్నాయి. విధుల్లో చేరి 2 నెలలు గడవక ముందే మళ్లీ పాఠశాలలు మూతపడటం, గత సంవత్సరం పని చేసిన 7 నెలల జీతాలు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.