ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..!

-

కేంద్రం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ గుడ్ న్యూస్ అందించేలా కనపడుతోంది. మినిమమ్ బేసిక్ శాలరీని భారీగా పెంచాలనే నిర్ణయాన్ని కేంద్రం తీసుకోనుందని తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇప్పుడు బేసిక్ శాలరీ 18 వేలు ఉండగా.. దీనిని 26 వేలు చేయనుందని తెలుస్తోంది.

దీనితో ఫిట్‌మెంట్ పెరగడం.. ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం కూడా పెరుగుతుంది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధులతో ఉద్యోగ సంస్థలు చర్చలు జరపబోతున్నాయి అని తెలుస్తోంది. దీని తరవాత శాలరీలని పెంచనున్నారు. ఫిట్‌మెంట్ పెంచితే మినిమమ్ బేసిక్ శాలరీ కూడా రూ.26 వేలకు పెరుగుతుంది.

ఫిట్‌మెంట్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ నుంచి ఫిట్‌మెంట్ పెంపుపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదం లభించనుందని మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. బేసిక్ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు కనుక పెంచారు అంటే డియర్‌నెస్ అలవెన్స్ 31 శాతం ఉంటుంది. ఇలా ఇది కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news