
మల్కాజిగిరి ఎంపీగా ఉన్న తనను రాజీనామా చేసి చేవెళ్ళ నుంచి పోటీ చేయాల్సిందిగా ఎంపీ రంజిత్ రెడ్డి సవాలు విసురుతున్నారని, ఆ సవాలుకు తాను సిద్ధమే అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, తన సవాలుకు కూడా రంజిత్ రెడ్డి సిద్ధం కావాలని షరతు విధించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు.