ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్ లో మంటలు ఒక్క సారిగా వ్యాపించాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో.. ఏకంగా.. తొమ్మిది బస్సులు..పూర్తిగా తగలబడ్డాయి. మరో రెండు బస్సులకు మంటలు వ్యాప్తి చెందాయి. పార్కింగ్ స్టాండ్ లో దాదాపు 20 కి పైగా బస్సులు నిన్న రాత్రి నిలిపారు.
ఈ నేపథ్యంలోనే.. ఇవాళ ఉదయం పూట ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డాయి. ఇక సమాచారం అందుకున్న వెంటనే అక్కడి చేరుకున్న ఫైర్ సిబ్బంది… బస్సుల్లో మంటలార్పుతున్నారు. ఇక ఈ ఘోర అగ్ని ప్రమాదం కారణంగా కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. ఇక మిగిలిన బస్సులను.. సంఘటన స్థలాలనను తరలించేందు ప్రయత్నిస్తున్నారు ఆ కంపెనీ డ్రైవర్లు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.