
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఆర్టీసీ ఏర్పాట్లను చేస్తోంది. మేడారంలో 50 ఎకరాల స్థలంలో భారీ ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలను, బస్సుల మరమ్మతులకు షెడ్లు, ఆర్టీసీ కార్మికులకు, అధికారులకు వసతికి షెడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఈసారి జాతరకు 21లక్షల మందిని తరలించేందుకు వరంగల్ రీజియన్ నుంచే 2,250 సర్వీసులను నడపనున్నారు.