వెల్గటూర్ మండలం సూరారం గ్రామంలో ఈ నెల13న దుర్గం చంద్రయ్యను చంపిన కేసులో మృతుని కుమారుడు పవన్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ధర్మపురి సర్కిల్ కార్యాలయంలో సీఐ కోటేశ్వర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. తరచూ మద్యం తాగి, కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో.. విసిగిపోయి తన తండ్రిని పవన్ కర్రతో కొట్టి చంపాడని వివరించారు. పవన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.