తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే… తెలంగాణలోని ప్రముఖులు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే.. తాజాగా… కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో… కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
ఈ విషయాన్ని స్వయంగా… తన సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ”నాకు గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ” అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రాజకీయ ప్రముఖులకు కరోనా సోకింది. మంత్రి ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం, పద్మాదేవేందర్రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి ప్రముఖులకు ఇప్పటికే కరోనా సోకింది.