సమ్మక్క- సారలమ్మ ఆలయం ప్రాంగణంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో చుట్టూ విద్యుత్ తీగలు ఉన్నాయి. దీనివల్ల భక్తులు జాతర అవసరాల కోసం వచ్చే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భూగర్భ విద్యుత్ లైన్ వేయాలని నిర్ణయించారు. ఆలయ అతిథిగృహం నుంచి దేవతల గద్దెలు, రేకుల షెడ్లు, భోజనశాల వద్దకు విద్యుత్ లైన్ వేసేందుకు కందకాలు తవ్వుతున్నారు.