రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసే రేవంత్ రెడ్డి రాజ్యాంగం, విలువలపై మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు లాంటి పనికిమాలిన కార్యక్రమాలకు పాల్పడే నీవా.. సీఎం కేసీఆర్ను నిందించేది అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపో మాపో జైలుకి వెళ్లే రేవంత్ రెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.