కాశ్మీర్ లో ముగ్గురు పాక్ స్మగ్లర్లు హతం

-

దేశ‌వ్యాప్తంగా ఉగ్ర‌వాదులు, స్మ‌గ్ల‌ర్లు నిత్యం ఏదో ఒక చోట రెచ్చిపోతూనే ఉన్నారు. భార‌త సరిహ‌ద్దు ప్రాంతాలు అయిన జమ్మూకాశ్వీర్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్ వంటి రాష్ట్రాల‌లో ముఖ్యంగా ఎక్కువ‌గా ఉంటున్నాయి. తాజాగా జ‌మ్మూకాశ్మీ్ రాష్ట్రంలోని పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్ట్ చేశారు.

వీరి వ‌ద్ద నుంచి భారీ మొత్తంలో డ్ర‌గ్స్‌ను సీజ్ చేశారు. మొత్తం 36 కేజీల వ‌ర‌కు ఉన్న‌ద‌ని భార‌త భ‌ద్ర‌తా అధికారులు వెల్ల‌డించారు. కాశ్మీర్ స‌రిహ‌ద్దుల ద్వారా ముగ్గురు పాకిస్తాన్ స్మ‌గ్ల‌ర్లు చొర‌బాటుకు ప్ర‌య‌త్నించ‌గా.. వారిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు నుంచి 36 ఫ్యాకెట్ల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్న‌ట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్ల‌డించారు. భార‌త్‌లోకి చొర‌బ‌డుతున్న ముగ్గురిని ఆదివారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల స‌మ‌యంలో అదుపులోకి తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version