పీఆర్సీ పంచాయితీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్ని డిమాండ్లు పరిష్కారం కాలేదని ఉపాధ్యాయ వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. స్టీరింగ్ కమిటీ సభ్యుల ఇళ్ళ ముట్టడి కి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఫిట్ మెంట్ 27 శాతంతో పాటు సీపీఎస్ రద్దు వంటి డిమాండ్ల కు పట్టు పెట్టాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు ఏపీటీఎఫ్, ఎస్టీయూ చెబుతోంది.
నిన్న ప్రభుత్వంతో చర్చలకు ఏపీటీఎఫ్, ఎస్టీయూ హాజరయ్యాయి. సమ్మె విరమణ ఒప్పందం పై సంతకాలు చేసి బయటకు వచ్చి ఉపాధ్యాయ సంఘాలు గళం మార్చాయి. చర్చల్లో ప్రభుత్వం సఫలం అయ్యింది… ఉద్యోగులు విఫలం అయ్యారని.. ఇతర డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఏపీటీఎఫ్ నేత పాండు రంగా రావు అన్నారు. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు.. బేషరతుగా చర్చలకు వెళ్ళారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని మండి పడ్డారు. ఉద్యోగుల ఆగ్రహం చవిచూడక తప్పదని ప్ర భుత్వాన్ని హెచ్చరించారు.