హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పుడు హరితహారం కాదు, హరిత సంహారం జరుగుతుంది. బల్దియా సిబ్బందికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి మధ్య సమన్వయ లోపం వల్ల వరంగల్ నగరంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. కరెంట్ తీగల కింద మొక్కలు పెట్టడం ఎందుకు, పెరిగాక అడ్డువస్తున్నాయి అని కొట్టడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.