జల్సాల అలవాటు పడి బైకులు చోరీ

ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను సిసిఎస్, కేయూసి పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శుక్రవారం వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ జగ్గగిరిగుట్ట ప్రాంతానికి చెందిన శివకుమార్ జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డారన్నారు.