జనగామ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ స్టేషన్గన్పూర్ గ్రామపంచాయతీ సిబ్బందికి 2020 నవంబర్ నుండి 2021 మార్చి వరకు ఐదు నెలల పెండింగ్ ఏరియల్స్ తక్షణమే చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో డిపిఓ రంగాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, గ్రామ పంచాయతీ యూనియన్ సీఐటీయూ నాయకులు కుంభం రాజు, దామెర రవి, వేల్పుల స్వామి పాల్గొన్నారు.