రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ‘ రామారావు ఆన్ డ్యూటీ ’ డేట్స్ వచ్చేశాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు ఫిలిం మేకర్స్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్, ఆచార్య, భీమ్లానాయక్, గని మొదలైన మూవీల విడుదలకు రంగం సిద్ధం అయింది. విడుదల తేదీలను ఆయా చిత్ర యూనిట్లు ప్రకటించాయి.
తాజాగా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం అయింది. మార్చి 25 లేదా ఎప్రిల్ 15న ఏదో ఒక తేదీలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. శరత్ మండవ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వేణు తొట్టెంపూడి ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. దివ్యాంశ కౌషిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్స్ ప్రకటించిడంతో రవితేజ ఫ్యాన్స్ కు ఇక పండగే. ఈనెల నుంచి టాలీవుడ్ లో సినిమా పండగ ప్రారంభం కానుంది.