మేడారం జాతరలో అపశృతి

crime
crime

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరలో అపశృతి చోటుచేసుకుంది. సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడి ఉన్న వెంకట నారాయణ (65) అనే వ్యక్తి మూర్ఛ వచ్చి మృతి చెందారు. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.