భక్తులతో కిక్కిరిసిన మేడారం

మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల దర్శనానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, (బంగారం) బెల్లం, చీరె, సారె సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో తల్లుల గద్దెలు కిటకిటలాడుతున్నాయి. మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనాలతో నిండిపోయాయి.