దేశంలో కోవిడ్ కేసులు నానాటికి విస్తరిస్తున్నాయి. రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 10 వేలను క్రాస్ అయ్యాయి. మరోవైపు అప్రమత్తమైన రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలను విధిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పార్లమెంట్ లో వరసగా సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సిబ్బందికి కరోనా సోకుతుండటంతో ఆందోళన నెలకొంటోంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు మొత్తం 875 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. రాజ్యసభ సెక్రటేరియట్‌లో ఇప్పటివరకు 271 మందికి వైరస్ సోకింది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కాబోతున్నాయి. ఈలోపే పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కీలకమైన ఈసమావేశాలకు రెండు సభల్లోని ప్రజాప్రతినిధులు తప్పకుండా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక సమావేశాల అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన అందరిలో నెలకొంది.