
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము గుండెపోటుతో ఆదివారం మృతి చెందినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అతని నివాసమైన వరంగల్ రామ్ నగర్‌లో ఈరోజు గుండెపోటుతో మృతి చెందినట్లు వివరించారు. అతడి ఆకస్మిక మృతి పట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.