కేయూలో అధికారులను కలిసేందుకు వచ్చే సందర్శకులు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో వర్సిటీలో విధులు నిర్వహించే ఉద్యోగులందరూ తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. వర్సిటీలో ఇప్పటికే పరీక్షల విభాగం అధికారుల ఫోన్ నెంబర్లు విద్యార్థులకు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.