కూలీల‌ వాహ‌నం బోల్తా

వ‌రంగ‌ల్, జ‌న‌వ‌రి 6 : కూలీల‌తో వెళ్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి బోల్తా ప‌డిన ఘ‌ట‌న గురువారం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ స‌మీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మ‌హ‌రాష్ట్ర సిరివంచ నుంచి ఖ‌మ్మం జిల్లాకు 30 మంది కూలీల‌తో వెళ్తున్న వాహ‌నం బోల్తా ప‌డింది. దీంతో ప‌లువురు కూలీల‌కు గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.