
భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామం వద్ద అటవీశాఖ అధికారులు పలిమల నుండి సీజ్ చేసిన టేకు కలపను తరలిస్తుండగా కలప లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న ముగ్గురు అటవీశాఖ అధికారులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.