మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం నరసాపురం గ్రామంలో సపావత్ రమదేవి అనే మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. రమాదేవి ఆత్మహత్యకు భూక్య కృష్ణ అనే యువకుడి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.