దేశానికి రియల్ హీరో, ఆదరించిన ప్రజల కోసం అక్షయ్ ది ఎప్పుడూ పెద్ద చేయే…!

-

భారత పౌరుడు కాదు… ఇక్కడ పుట్టలేదు. కాని మన దేశంలో సూపర్ స్టార్ అయ్యాడు. మన దేశంలో ఆదరించారు… మన దేశంలో ప్రతీ ఒక్కరికి అతను ఆదర్శం అయ్యాడు. దేశానికి కష్టం వస్తే నేను ఉన్నా అన్నాడు. ఖాన్ త్రయాన్ని ఎదుర్కొని అగ్ర హీరో అయ్యాడు. ఖాన్ త్రయాన్ని తట్టుకుని వారికి సవాల్ చేసాడు. కెనడా లో పుట్టినా సరే ఇక్కడ అతనికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

తనను సినిమాల్లో ఆదరించిన వారి కోసం తాను కూడా ఏదొకటి చెయ్యాలి అనుకున్నాడు. వరదలు వస్తే ప్రజల కోసం నిలబడ్డాడు, కష్టాలు వస్తే నేను ఉన్నా అన్నాడు, సైనికుల కోసం తన వంతు సేవ చేసాడు. ఇప్పుడు కరోనా వైరస్ కోసం తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశానికి తన అవసరం ఉందని గుర్తించాడు. తన చేతిలో ఉన్న సహాయాన్ని తన వంతుగా చేసాడు. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

అతనే బాలివుడ్ యాక్షన్ కింగ్, బాలీవుడ్ సింగ్, అక్షయ్ కుమార్. కరోనా వైరస్ కోసం ఏకంగా పాతిక కోట్లు సాయ౦ ప్రకటించి సంచలనం సృష్టించాడు. దేశ ప్రజలను ఆశ్చర్యపరిచాడు. కరోనా వైరస్ కోసం తన వంతుగా సహాయం అందించాడు. అక్షయ్ ఈ విధంగా సాయం చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతీసారి అతను దేశ భక్తిని చాటుకున్నాడు. పుల్వామా దాడి జరిగిన సమయంలో ఆయన 5 కోట్ల సాయం ప్రకటించాడు.

ఆ తర్వాత అస్సాం వరదలు వచ్చిన సమయంలో రెండు కోట్లు సాయం చేసాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సహాయం అందించాడు. ఆ తర్వాత చెన్నై వరదల సమయంలో కూడా కోటి రూపాయల సాయం చేసాడు. సిఆర్పీఎఫ్ కుటుంబాలకు గానూ కోటి 8 లక్షల రూపాయల సాయం చేసాడు. మావోయిస్ట్ ల దాడి లో మరణించిన ఈ కుటుంబాల బాధ్యతను తాను తీసుకున్నాడు.

చెన్నై లో ట్రాన్స్ జెండర్ల ఇళ్ళ కోసం ఒక కోటి 50 లక్షలు సహాయం చేసాడు. ఇప్పుడు కరోనా వైరస్ కోసం 25 కోట్ల సాయం చేసాడు. అతను కెనడా పౌరసత్వం ఉన్న వ్యక్తి. భారత్ లో సూపర్ స్టార్ అయ్యాడు. దీనితో తనను ఆదరించిన వారి కోసం ఎప్పుడూ ముందుకి వస్తూనే ఉన్నాడు. సైనికుల కోసం భారత్ కే వీర్ అనే కార్యక్రమాన్ని కూడా ఆయన మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమం ద్వారా సైనికుల కుటుంబాలకు సహాయం చేస్తున్నాడు.

సినిమాలతో సంబంధం లేకుండా అతనికి అన్ని వర్గాల అభిమానులు ఫిదా అయిపోయారు. ఎందరికో అభాగ్యులకు అతను అనధికారికంగా సహాయం చేస్తూనే ఉన్నాడు. రైతుల కోసం నానా పటేకర్ తో కలిసి ముందుకి వచ్చాడు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం బలంగా ఇచ్చాడు అక్షయ్. ఎందరో స్టార్ హీరోలకు లేని హృదయం అక్షయ్ కుమార్ కి ఉందీ అంటూ పలువురు కొనియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version