జూనియర్ ఎన్‌టీఆర్ రాజకీయ భవిష్యత్తును చెప్పేసిన వేణుస్వామి..!

జూనియర్ ఎన్‌టీఆర్ జాతకచక్రంలో ఉన్న గ్రహస్థితి వల్ల అతను రాజకీయాల్లోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తాడని వేణు స్వామి చెప్పారు. అయితే జూనియర్ ఎన్‌టీఆర్ తాను రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటేనే అది జరుగుతుందని ఆయన అన్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఇక మళ్లీ ఎన్నికలు రావాలంటే 2024 వరకు ఆగాల్సిందే. అయినప్పటికీ అప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు ? ఎవరికి ఆ అవకాశం ఉంది ? అప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది ? అన్న విషయాలను ఇప్పుడే చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇక ప్రముఖ జ్యోతిష్యుడు, సంఖ్యా శాస్త్రవేత్త వేణు స్వామి కూడా ఆ విషయాలను వెల్లడించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జూనియర్ ఎన్‌టీఆర్, పవన్ కల్యాణ్‌ల రాజకీయ భవితవ్యంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

astrologer venu swamy predicted junior ntrs political life

జూనియర్ ఎన్‌టీఆర్ జాతకచక్రంలో ఉన్న గ్రహస్థితి వల్ల అతను రాజకీయాల్లోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తాడని వేణు స్వామి చెప్పారు. అయితే జూనియర్ ఎన్‌టీఆర్ తాను రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటేనే అది జరుగుతుందని ఆయన అన్నారు. జూనియర్ ఎన్‌టీఆర్ రాజకీయాల్లోకి రావాలని సంకల్పిస్తేనే ఆయన జాతకంలోని గ్రహాలన్నీ ఆయనకు సహకరిస్తాయని వేణు స్వామి అన్నారు.

ఇక వేణు స్వామి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు అధికార యోగం లేదని గతంలోనే తాను చెప్పానని అన్న వేణు స్వామి 2024లో మాత్రం పవన్‌కు కొంత వరకు మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇక జూనియర్ ఎన్‌టీఆర్ తన తాతలా ఒక కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళితే ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని వేణు స్వామి అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌ల వ్యక్తిత్వాలను కూడా వేణు స్వామి పోల్చారు. పవన్ మంచితనానికి మారు పేరని, ఆయనలాంటి వ్యక్తిత్వం ఇప్పటి రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదని వేణు స్వామి అన్నారు. పవన్ నిరాడంబరమైన జీవనశైలిని పాటిస్తారని, పవన్ వ్యక్తిత్వం ముందు ఎవరు సరిరారు అని అన్నారు. కాగా గతంలో వేణు స్వామి పవన్ గురించి చెప్పిన జాతకంపై పవన్ అభిమానులు ఆయనపై ఫైరయ్యారు. మరిప్పుడు జూనియర్ ఎన్‌టీఆర్ విషయంలో వేణు స్వామి చెప్పినదానికి తారక్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..!