ఎడిట్ నోట్: ‘డ్రామా’ షురూ!

-

తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత చూడ ముచ్చటగా ఉంది అనుకునేలోపే ఏదో ఒక రచ్చ వస్తూనే ఉంటుంది…గతంలో అంటే ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ఉండగా…నిత్యం ఏదొక రచ్చ జరిగేది. కానీ ఏపీలో జగన్ వచ్చాక పరిస్తితి మారింది…కేసీఆర్ తో సఖ్యతగా ఉంటున్నారు..ఇద్దరు సీఎంలు సాన్నిహిత్యం బాగుంటుంది. అయితే అంతా బాగానే ఉందనుకునే సమయంలో అనూహ్యంగా ఏదొక వివాదం తెరపైకి వస్తుంది. ఇక దాని గురించి రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదంతా కొన్ని రోజులు మాత్రమే మళ్ళీ క్లోజ్ అయిపోతారు.

ఇలా ప్రతీసారి జరుగుతూనే వస్తుంది..ఇలా జరగడం వెనుక రాజకీయ కోణమే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది..తమ తమ రాష్ట్రాల్లో ఉండే సమస్యలు పక్కదారి పట్టడానికి…రెండు వైపులా అధికార పార్టీ నేతలు విమర్శలకు దిగుతున్నట్లు అర్ధమవుతుంది. గతంలో రాయలసీమ హెడ్ రెగ్యులేటర్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు ఎప్పుడో మొదలైతే…కేసీఆర్ మాత్రం హుజూరాబాద్ ఉపఎన్నికల ముందే హడావిడి చేయడం మొదలుపెట్టారు. దీనిని పట్టుకుని గులాబీ నేతలు రెచ్చిపోయారు…ఏపీపై విమర్శలు చేశారు. అటు ఏపీలో అధికారంలో వైసీపీ నేతలు కూడా తిరిగి ఫైర్ అయ్యారు.

మరి తర్వాత ఏమైందో తెలియదు గాని….సడన్ గా ఈ మాటల యుద్ధం ఆగిపోయింది. సరే మళ్ళీ తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగానే ఉంటున్నాయనే సమయంలో గోదావరి వరదలు వల్ల రాజకీయం మొదలైంది. అనూహ్యంగా వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపుకు గురైన విషయం తెలిసిందే. అయితే వరదల వల్ల నష్టపోయిన ప్రజలని ఆదుకోవడం, వారికి సాయం చేయడం లాంటివి ఎంత బాగా చేస్తున్నారో తెలియదు గాని…అనూహ్యంగా పోలవరం ఎత్తు పెంచడం వల్లే తమకు వరద ముంపు వచ్చిందని తెలంగాణ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు.

పోలవరం ఎత్తు పెంచడం వల్ల బ్యాక్‌వాటర్‌ ఎగదన్ని భద్రాచలానికి ముప్పు వాటిల్లుతుందని, భద్రాచలంలోకి వరద నీరు ప్రవేశించకుండా, ఆలయం మునిగిపోకుండా కరకట్టలు నిర్మిస్తామని.. ఇందుకు దాని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని ఏపీని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు పువ్వాడతో గొంతు కలిపారు.

అటు ఏపీ నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు రియాక్ట్ అయ్యారు..వరదలు వస్తే ముంపు సహజమే అని, అలా అంటే తాము హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోయామని, మరి ఆ నగరాన్ని ఏపీలో విలీనం చేయాలంటే చేసేస్తారా అని అడిగారు. అలాగే భద్రాచలం తమకు ఇచ్చేయాలని మాట్లాడారు. ఇక అటు తెలంగాణ ఎంపీలు, ఇటు ఏపీ ఎంపీల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది.

అయితే రాష్ట్రంలో ఉండే సమస్యలని డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు ఇలా..పోలవరం విషయం తెరపైకి తీసుకొచ్చారని, అటు ఏమో పోలవరం ఏదో పూర్తి చేసేసినట్లు చూపించుకోవడానికి ఈ మధ్యే అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం ఎత్తు పెంచేసింది. ఇలా టీఆర్ఎస్, వైసీపీ నేతలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య ఏదో గొడవ జరిగిపోతున్నట్లు రాజకీయం మొదలుపెట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఈ వరదలో కూడా కొత్త డ్రామా స్టార్ట్ చేశారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version