త్వ‌ర‌లో సైకిల్ యాత్ర చేయ‌నున్న నారా లోకేష్‌..? ఇక నిత్యం జ‌నాల్లోనే..?

-

ఇప్ప‌టికిప్పుడు పాద‌యాత్ర చేస్తే పార్టీకి ఏ మేర లాభం జ‌రుగుతుంద‌నే సందేహం లోకేష్‌కు క‌లుగుతున్న‌ద‌ట‌. అందుక‌ని ఎన్నిక‌ల వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌వ‌చ్చ‌ని, ఇప్పుడు సైకిల్ యాత్ర చేద్దామ‌ని లోకేష్ అనుకుంటున్నార‌ట‌.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి అనంత‌రం తెలుగు దేశం పార్టీ భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. ఆ పార్టీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీలు ఇప్ప‌టికే బీజేపీలో చేరారు. ఇక త్వ‌ర‌లోనే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతార‌ని తెలుస్తోంది. అయితే ఇలాంటి క్లిష్ట‌స్థితిలో ఓ వైపు పార్టీని కాపాడుకోవ‌డంతోపాటు మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే సిద్ధం కావాల‌ని తెలుగు త‌మ్ముళ్లు చంద్ర‌బాబుకు చెబుతున్నార‌ట. దీంతో చంద్ర‌బాబు కొంత కాలం అయ్యాక నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండేలా పాద‌యాత్ర చేస్తార‌ని తెలుస్తోంది.

కాగా చంద్ర‌బాబు పాద‌యాత్ర సంగతి అటుంచితే ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భ‌విష్య‌త్ ఏమిట‌న్న‌ది చంద్ర‌బాబును క‌ల‌వరానికి గురి చేస్తోంద‌ట‌. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో లోకేష్ మంగ‌ళ‌గిరిలో వైసీపీ అభ్య‌ర్థి ఆర్కే చేతిలో దారుణంగా ఓడిపోవ‌డం.. తెలుగు దేశం పార్టీ శ్రేణుల‌కు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే నారా లోకేష్ కూడా త‌న తండ్రిలాగే నిత్యం జ‌నాల మ‌ధ్య ఉండేలా పాద‌యాత్ర చేస్తే బాగుంటుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు లోకేష్‌కు చెబుతున్నార‌ట‌. దీంతో ఆ విష‌యం స‌బ‌బే అని లోకేష్‌కు కూడా అనిపించింద‌ట‌. ఈ క్ర‌మంలోనే లోకేష్ కూడా పాద‌యాత్ర చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నార‌ట‌.

అయితే ఇప్ప‌టికిప్పుడు పాద‌యాత్ర చేస్తే పార్టీకి ఏ మేర లాభం జ‌రుగుతుంద‌నే సందేహం లోకేష్‌కు క‌లుగుతున్న‌ద‌ట‌. అందుక‌ని ఎన్నిక‌ల వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌వ‌చ్చ‌ని, ఇప్పుడు సైకిల్ యాత్ర చేద్దామ‌ని లోకేష్ అనుకుంటున్నార‌ట‌. సైకిల్ యాత్ర ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డంతోపాటు… అధికార వైసీపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌వ‌చ్చ‌ని లోకేష్ అనుకుంటున్నార‌ట‌. అందులో భాగంగానే ఆయ‌న్ను ఇటీవ‌లే టీడీపీ సోష‌ల్ మీడియా ఇన్‌చార్జిని చేశార‌ని స‌మాచారం. ఇక లోకేష్ కూడా ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో వైసీపీపై విమ‌ర్శ‌ల అస్త్రాలు పెంచారు. ట్విట్ట‌ర్‌లో లోకేష్ నిత్యం యాక్టివ్‌గా కూడా ఉంటున్నారు. ఇక సైకిల్ యాత్ర‌తో జ‌నాల‌కు మ‌రింత ద‌గ్గ‌రైతే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపును తెచ్చుకోవ‌డంతోపాటు మ‌రోవైపు పార్టీ స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించుకుంటూ ఎన్నిక‌ల‌కు మ‌రింత ప‌క‌డ్బందీగా సిద్ధ‌మ‌వ్వ‌చ్చ‌ని లోకేష్ అనుకుంటున్నార‌ట‌. అందుక‌నే ఎంత వీలైతే అంత త్వ‌ర‌గా సైకిల్ యాత్ర చేప‌ట్టాల‌ని లోకేష్ భావిస్తున్నార‌ట‌.

అయితే నారా లోకేష్ చేప‌ట్టాల‌ని భావిస్తున్న సైకిల్ యాత్ర కేవ‌లం ప్ర‌తిపాద‌న‌నే అని.. దానికి చంద్ర‌బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించాల‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు ఓకే చెబితే వెంట‌నే లోకేష్ ఆ యాత్ర చేప‌డుతార‌ని తెలుస్తోంది. గ‌తంలో వైఎస్‌, మొన్నీ మ‌ధ్య జ‌గ‌న్‌లు నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ యాత్ర‌ల ద్వారానే ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం చేప‌ట్టారు. దీంతో లోకేష్ కూడా అదే బాట‌లో ప‌యనించాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రి ఆయ‌న సైకిల్ యాత్ర ఎప్ప‌టి నుంచి ప్రారంభిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version