ఇంటర్‌తో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు !!

-

సంగారెడ్డిలో ఈ నెల 16 వ తేదీ నుంచి 21 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ

కేంద్రంలో కొలువులు అంటే ఎప్పటికే క్రేజీనే. అందులో భద్రమైన కొలువు, అన్నిరకాల సౌకర్యాలు, తక్కువ చదువుతో జీవితంలో స్థిరపడే అవకాశం కల్పించే వాయుసేన కొలువుల ర్యాలీ సంగారెడ్డిలో జరుగనున్నది. ఆ వివరాలు తెలుసుకుందాం…

ఇంటర్ పాసౌతే ,చాలు. ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది ఐఏఎఫ్ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్). సంగారెడ్డిలోని సుల్తాన్ పూర్‌లో ఉన్న జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ఈ నెల 16 వ తేదీ నుంచి 21 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ద్వారా ఎయిర్‌మెన్ గ్రూప్ వై-నాన్ టెక్నికల్ పోస్టుల్ని భర్తీ జరగనుంది.

Airforce Job For 12th Pass 2020
Airforce Job For 12th Pass 2020

ఎవరు అర్హులు ?

వివాహం కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. సుమారు పది వేల మంది ఈ ర్యాలీకి వస్తారని అంచనా. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో ఇంటర్ రెండు సంవత్సరాల్లో 50 శాతం మార్కులు ఉండాలి.

వయస్సు ఎంత ఉండాలి ?

అభ్యర్థులు 2000 జనవరి 19 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పోలీస్ ఉద్యోగానికి 175 సెంటీమీటర్ల ఎత్తు, ఆటో టెక్నీషియన్‌కు 165 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
శిక్షణ – ఎంపికైన వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో స్టైఫండ్ ఇస్తారు.
జీతభత్యాలు – ఉద్యోగంలో చేరిన తర్వాత రూ. 21,700 ల వేతనం లభిస్తుంది. దీంతోపాటు అదనంగా క్యాంటీన్‌, రేషన్‌, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు వాయుసేన నిబంధనల ప్రకారం కల్పిస్తారు.

రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను : airmenselection.cdac.in  వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news