వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బాబుకు నోటీసులు

-

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్లకూ కూడా నోటీసులు పంపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది హైకోర్టు.

ఇక అప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీ రామ్ హామీని హైకోర్టు నమోదు చేసింది. దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని సూచిస్తూనే సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కాగా, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. 1400 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని వివేకా హత్యపై కూపీలాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news