ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు… రాత పరీక్ష లేకుండానే..రూ.36 లక్షల జీతం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ కి చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నెన్స్‌ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 17 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, అనలిస్ట్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక ఎవరు ఈ పోస్టులకి అర్హులు అన్నది చూస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ/ సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ సంబంధిత స్పెషలైజేషన్‌ ని పూర్తి చేసి ఉండాలి. అలానే అనుభవం కూడా ఉండాలి.

ఇక ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూస్తే జనవరి 17, 2023వ తేదీ లోపు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవడానికి అవకాశం వుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఇంటర్వూ ఉంటుంది. ఇంటర్వూ కి ఎంపికైన వాళ్ళ వివరాలు జనవరి 27న ఇస్తారు. ఇక శాలరీ విషయానికి వస్తే.. ఏడాదికి రూ.5.4 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఇస్తారు. పూర్తి వివరాలని http://www.apsdps.ap.gov.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news